ఘనంగా శ్రీ వేణుగోపాలుడి కల్యాణ మహోత్సవం వైభవంగా

వర్గల్, ఆంధ్రప్రభ : వర్గల్ మండల కేంద్రంలోని విశిష్టత కలిగిన పురాతన దేవాలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

కళ్యాణ మహోత్సవానికి ప్రాంతం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాలు, భజా భజంత్రీలు, బాణాసంచా, విద్యుత్ కాంతుల మధ్య స్వామివారి ఎదురుకోలు నిర్వహించి, అనంతరం పురవీధుల్లో ఊరేగింపుగా శ్రీ వేణుగోపాలస్వామి సేవను నిర్వహించారు.

తదనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు టేకులపల్లి రామ్ రెడ్డి, ప్రొద్దుటూరు రాజులు, సర్పంచ్ జయభారతి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply