జనాభా గణనను పరిశీలించిన కమీషనర్

జనాభా గణనను పరిశీలించిన కమీషనర్
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న జనాభా గణన ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులను సందర్శించిన ఆయన, సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. జనాభా గణనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల అమలు, పట్టణాభివృద్ధి ప్రణాళికలకు జనాభా గణన ఎంతో కీలకమని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, మాస్టర్ ట్రైనర్ దూడల వెంకటేష్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
