కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం అభినందనీయమని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. భీమ్‌గల్‌ మండలంలోని ముచ్కూర్ గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే సర్పంచ్ కోడిగాలా ఒడిగెల శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ,పేదింటి ఆడబిడ్డలకు ఆదుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, రాష్ట్ర కో- ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,మైనింగ్ శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్ లకు లబ్ధిదారులు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలనాధికారి గంగాధర్, పంచాయతీ సెక్రటరీ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ బాశెట్టి రమేష్, నాయకులు గట్టు మురారి, బద్ది అవినాష్,కొరడి రాజు, కొరడి లింబాద్రి, అంతం గంగాగౌడ్, బసిరి రాజు, భాశెట్టి రాము, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వార్డ్ మెంబర్ లు వికాస్,మమత, సుమలత, బోల్ట్ రంగారెడ్డి, గిర్ని రాజు, విల్సన్, గంగాధర్ గౌడ్, లబ్ధిదారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply