ధాన్యం రవాణా, దిగుమతిలో రైతులు ఆందోళన చెందొద్దు

ధాన్యం రవాణా, దిగుమతిలో రైతులు ఆందోళన చెందొద్దు

-మార్కెట్ చైర్మన్ విమల వెంకటేశ్వర్లు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్,సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లులలో హమాలీల కొరతతో ధాన్యము కాంటాలు , రవాణా, దిగుమతిలో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వారి దృష్టికి తీసుకురాగా,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ల సహకరంతో కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడించి త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని రైతులకు వివరించారు.ఈ సందర్భంగా వీరి వెంట సంఘ కార్యదర్శి కే వరలక్ష్మి , రైతులు తదితరులు ఉన్నారు.

Leave a Reply