విద్యుత్ ఘాతంతో అరటి, టేకు తోటలు దగ్ధం

విద్యుత్ ఘాతంతో అరటి, టేకు తోటలు దగ్ధం

  • రూ 10 లక్షల పైగా నష్టం

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోనిరామచంద్రపురం గ్రామానికి చెందిన అరటి, టేకు తోటలు, గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం రామచంద్రపురంకి చెందిన సిరిపురం కుమారస్వామి, నాలుగు ఎకరాల అరటి తోట, పై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి అరటి తోట దగ్ధమై, పక్కనగల రైతు ఆకుల సమ్మయ్య, టేకు తోట, నిలువ చేసిన టేకు కర్ర, దగ్ద మైనట్లు తెలిపారు.

దీంతో సుమారు రూ 10 లక్షల పైగా నష్టం జరిగినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. అలాగే మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి( సి) కి చెందిన రైతు బాలవేణి వేణు కు చెందిన మిరప తోట ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో దగ్ధమై రూ 20 లక్షలు నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపారు.

Leave a Reply