పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గంచాలి

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గంచాలి
- కేసముద్రం మండల సీపీఎం
కేసముద్రం, ఆంధ్రప్రభ:
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లు కట్టి లాగుతు ఆందోళన, నిరసన కార్యక్రమం చేయడంజరిగింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, ప్రతి నెల పెంచడం వల్ల, జీవనోపాధి కోసం ఆటోలు నడుపుతున్న కార్మికులకుటుంబాలు రోడ్డున పడతాయన్నారు.
అంతర్జాతీ యంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ వినియోగదారులకు ధరలు తగ్గించ లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని పొదుపు సూత్రాలు చెబుతున్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యవసర సరుకులు ధరలుపెరుగుతాయని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆయిల్ కంపెనీల లాభం కోసం ప్రజా వ్యతిరేకవిధానాలు మానుకొని ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
