అగ్ని ప్రమాదంలో వరి పంట దగ్ధం

అగ్ని ప్రమాదంలో వరి పంట దగ్ధం

చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు కట్కూరి సారయ్యకు చెందిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సారయ్య మూడేకరాల వరి పొలాలను కౌలు తీసుకొని సాగు చేస్తున్నాడు.

పంట కోత సమయానికి శుక్రవారం జరిగిన ప్రమాదంలో మంటలు ఆకస్మికంగా వ్యాపించగా, గ్రామస్థులు నీటితో సహాయపడినా, ఒక ఎకరానికి పైగా వరి పొలం బూడిదయి పోయింది.

ఈ ఘటనపై మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ స్పందిస్తూ, ఆరుగాలం కృషి చేసిన రైతుకు పెద్ద నష్టం కలిగిందని, ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ. 50,000 నష్టపరిహారం అందించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే, మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అల్లం తిరుపతి, బీఆర్‌ఎస్ నాయకులు పిట్టల రమేష్, బోల్లపల్లి సాంబయ్య, ఓర్సు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply