28వ వర్ధంతి సభను విజయవంతం చేయండి

28వ వర్ధంతి సభను విజయవంతం చేయండి


గణపురం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో మంగళవారం నిర్వహించనున్న 28వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బొబ్బాల సాంబయ్య, కన్నూరి కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. సోమవారం మండల కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సానుభూతిపరులు,విప్లవ అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు హాజరై వర్ధంతి సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బొబ్బాల సాంబయ్య కన్నూరి కుమారస్వామి పివైఎల్ రాష్ట్ర కన్వీనర్ పావురాల బిక్షపతి అలియాస్ సింగన్న, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కన్వీనర్ దొగ్గేల సుధాకర్, ఐఎఫ్టియు రాష్ట్ర కన్వీనర్ తాళ్లపల్లి శ్రీనివాస్, ప్రజా ప్రతిఘటన రాష్ట్ర నాయకులు సామ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply