విద్యార్థుల బైఠాయింపు
సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్
ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం భోజనం బంద్ పెట్టిన విద్యార్థులు… యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద బైఠాయించారు.
ఈ సందర్భంగా పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.