ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజకార్యక్రమలు..

ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజకార్యక్రమలు..

లోక కల్యాణం కోసం దేవస్థానం 27వ తేది నుండి 30 వ తేది వరకు…

నంద్యాల బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో వెలసిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయాల్లో ఈనెల 27వ తేదీ నుంచి 37వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు శ్రీశైల ద్వారా క్షేత్రాల్లో అనుసంధానంగా వెలసిన అక్కడి అది దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

గిరిప్రదక్షిణ గా పిలువబడే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి ఆయా ద్వారక్షేత్రాలలో ప్రత్యేక పూజలను జరిపించిన తరువాత చివరి రోజున మే 1 వ తేది న శ్రీశైలంలో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ అర్చనలలో ప్రతి ఆలయంలోను శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, శ్రీ అమ్మవారికి సహస్రనామార్చన జరిపించబడుతాయన్నారు.

ఈ విశేష కైంకర్యంలో శ్రీశైల దేవస్థానం తరుపున ప్రతీ ఆలయంలోను అక్కడ అధిదేవతలకు వస్త్రాలు సమర్పించ బడుతాయన్నారు. అదే విధంగా ప్రతీ ఆలయంలోను అర్చక సత్కారం చేయబడుతుందన్నారు. ఈ సత్కార కార్యక్రమంలో ఆయా ఆలయాలలోని ప్రధాన అర్చకులకు, ఉపప్రధానార్చకులకు దేవస్థానం తరుపున నూతన వస్త్రాలు, శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, సంభావన అందజేయబడుతాయన్నారు .

ఈ కార్యక్రమంలో భాగంగా 27 వ తేది న శ్రీశైలక్షేత్ర తూర్పుద్వారమైన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోనూ, 28 వ తేది న దక్షిణ ద్వారమైన కడప జిల్లాలోని సిద్ధవటంలోనూ, 29 వ తేది న పశ్చిమద్వారమైన తెలంగాణా రాష్ట్ర జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలోనూ, 30 వ తేదిన నాగర్‌కర్నూలు జిల్లాలోని ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరంలో పూజలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

చివరగా మే 1 వ తేది న ఈ దేవస్థానములో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా విశేషపూజలు జరుగుతాయన్నారు. శ్రీశైలానికి నేరుగా రోడ్డుమార్గం లేని పూర్వపు రోజులలో ఈ నాలుగు క్షేత్రాల మీదుగా భక్తులు శ్రీశైలాన్ని చేరుకోవడంతో ఈ నాలుగు క్షేత్రాలు శ్రీశైల ద్వార క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply