Telangana | సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ

Telangana | సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా కొనసాగుతోంది. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహిస్తున్న ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు భద్రగిరికి తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా హాజరై, శ్రీరామ నామస్మరణతో ప్రాంతమంతా మారుమ్రోగుతోంది.

మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించేలా అలంకరించగా, శిల్పకళా శోభితమైన ప్రత్యేక కళ్యాణ మండపంలో జరిగిన రామయ్య కల్యాణం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, ప్రతి ఒక్కరినీ అలరించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా భద్రాద్రికి విచ్చేసి, ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దంపతులు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం పండితులు కళ్యాణ మహోత్సవ ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. అలాగే భద్రాచలంలో రూ.351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం, మంత్రులు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి రామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply