TG | తెలంగాణ కేబినెట్ వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ఈనెల 28కి వాయిదా పడింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన శుక్రవారం నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఏఐసీసీ సమావేశం (AICC meeting) లో పాల్గొనడానికి గాను మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), కొండా సురేఖ (Konda Surekha), వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఢిల్లీకి వెళ్లారు.
వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka), నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఐదుగురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్న కారణంగా కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ భేటీని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు.
