MATCH | వీకెండ్‌లో ఐపీఎల్ ఫెస్ట్‌

MATCH | వీకెండ్‌లో ఐపీఎల్ ఫెస్ట్‌

MATCH | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వీకెండ్‌లో ఐపీఎల్ ఫ్యాన్స్‌కి పండ‌గే పండ‌గ‌. ఈ రోజు శ‌నివారం కావ‌డంతో రెండు మ్యాచుల‌ను నిర్వ‌హిస్తారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. అలాగే ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి.

ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు ఆడి రెండు ఓడి, రెండు గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన ఢిల్లీ.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సీఎస్కే, ఆఖరి రెండు మ్యాచ్‌లలో బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో ఫామ్‌లోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ప్రత్యర్థులను భయపెట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి, మూడు ఓడింది. సీఎస్కే కూడా మూడు ఓడి, రెండు గెలిచింది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదో స్థానంలో కొనసాగుతుండగా, సీఎస్కే 8వ స్థానంలో ఉంది.

Leave a Reply