Tamil Nadu CM | తమిళనాడు అంశాలపై కీలక చర్చలు

Tamil Nadu CM | తమిళనాడు అంశాలపై కీలక చర్చలు
Tamil Nadu CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ప్రధాని మోడీని తొలిసారిగా కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ముందుగా ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న సీఎం విజయ్.. అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 25నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తమిళనాడుకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
భేటీ అనంతరం ఇరువురు నేతలు కలిసి దిగిన ఫొటోలను ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
