Collector | సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

Collector | సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
కలెక్టర్ డా.ఏ.సిరి
Collector | కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పీజీఆర్ఎస్ అర్జీలను సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి (Collector Dr. A. Siri) అధికారులను ఆదేశించారు.. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి కలెక్టర్ వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… అధికారులందరూ పీజీఆర్ఎస్‌లో (PGRS) ప్రతి రోజు లాగిన్ అయి ఎట్ టూ వ్యూ అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. వచ్చిన వెంటనే అర్జీలను చూస్తే, రెవెన్యూ అర్జీల లాంటి వాటికి నోటీసులు ఇచ్చే టైమ్ ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఇంప్రాపర్ రెడ్రెస్సల్, ఎండార్స్మెంట్ లు సరిగా ఇవ్వకపోవడం, రీ ఓపెన్ అయిన కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో ఉన్న కింది స్థాయి అధికారులకు మెమోలు జారీ చేసి, సంబంధిత మెమోలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయాలని కలెక్టర్ (Collector) అధికారులను ఆదేశించారు.. 10 రోజులకు ఒకసారి వివిధ శాఖల హెచ్‌ఓడీలు వారి కింది స్థాయి సిబ్బందితో పీజీఆర్ఎస్ అంశంపై ట్రైనింగ్‌లు నిర్వహించాలని, ఆ ఫోటోలను గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయాలన్నారు. అదే విధంగా ప్రతి రోజు కొంతమంది అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. అర్జీలు గడువు లోపు పరిష్కరించాలని, రీ ఓపెన్ కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎన్టీఆర్ వైద్యసేవకి సంబంధించి అన్ని ఆసుపత్రులలో జిల్లాలో ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రదర్శించాలన్నారు. టోల్ ఫ్రీ ద్వారా ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు, మున్సిపాల్టీ లలో సమస్యలకు సంబంధించి పత్రికల్లో ఎక్కువగా వార్తలు వస్తున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్యలు (Drinking water problems) తలెత్తకుండా ట్యాంకులు, మైనర్ ఇరిగేషన్ చెరువులను ఆర్డీవోలు తనిఖీ చేసి మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..
