భక్తిశ్రద్ధలతో నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడలోని వన్‌టౌన్‌లోని పాత శివాలయంలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం ప్రదోష కాల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢ మాస బహుళ త్రయోదశిని పురస్కరించుకుని సోమవారం శ్రీ నందీశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేషార్చన, పంచహారతులు నిర్వహించారు.
అనంతరం ఉభయదాతలకు మంత్రపుష్పం, ఆశీర్వచనం అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, ఆలయ అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, కె. మురళీధరన్ నంబూద్రి, అభిషేక పండితుడు కొత్తపల్లి సాయికృష్ణ శర్మ, సహాయకులు నాదెళ్ల లక్ష్మి రాఘవేంద్ర శర్మతో పాటు ఆలయ సిబ్బంది కార్యక్రమాలను నిర్వహించారు.
