పేద విద్యార్థినికి సుజనా చౌదరి ఆర్థిక సాయం

పేద విద్యార్థినికి సుజనా చౌదరి ఆర్థిక సాయం

భవానిపురం, ఆంధ్రప్రభ: సామాజిక సేవలో ముందుండే ఎమ్మెల్యే సుజనా చౌదరి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలకు పలు విధాలుగా సాయం అందిస్తున్న ఆయన, తాజాగా ఓ పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.

పూర్ణానందంపేటకు చెందిన ఎం. జయంతి ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో, ఇంటర్మీడియట్ చదువుల కోసం ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకున్నారు. అదనంగా రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఈ ఆర్థిక సాయాన్ని విద్యార్థిని జయంతికి అందజేశారు. అడిగిన వెంటనే సాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి జయంతి కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply