శ్రీ పరుశరామేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి టి.జి. భరత్
శ్రీ పరుశరామేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి టి.జి. భరత్
ఏర్పేడు, ఆంధ్రప్రభ: రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టి.జి. భరత్ ఏర్పేడు మండలం గుడిమల్లంలోని శ్రీ ఆనందవళ్లి సమేత శ్రీ పరుశరామేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ సిబ్బంది, అర్చకులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వాహణాధికారి మునిశేఖర్రెడ్డి మంత్రికి ఆలయ ప్రాముఖ్యత, చరిత్రను వివరించారు.
పూజల అనంతరం మంత్రికి ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ చరిత్రను తెలియజేసే పుస్తకాన్ని బహూకరించారు.
