Sub Collector | మౌనం.. ఆగ్రహం..

Sub Collector | మౌనం.. ఆగ్రహం..
Sub Collector | బోధన్, ఆంధ్రప్రభ : సాలుర మండల మంజీరా పరివాహక ప్రాంతంలోని తగ్గేల్లి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ బోధన్ సబ్ కలెక్టర్ స్పందించడం లేదని మాజీ శాసనసభ్యులు షకీల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బోధన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ రాయతీకి గండిపడుతున్నప్పటికీ సబ్ కలెక్టర్ స్పందించడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ఇసుక నింపి తరలిస్తున్నారని ఆరోపించారు.
అధికార పార్టీకి పార్టీ ఫండ్ గా ఇసుక ద్వారా వచ్చే నిధులు ఉపయోగపడతాయని అన్నారు. బీ.ఆర్.ఎస్ మద్దతు ద్వారా గ్రామ పంచాయతీలు ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఇతర వార్డ్ మెంబర్లు భయపడాల్సిన పని లేదని అన్నారు. పార్టీ మారాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వత్తిళ్లకు భయపడాల్సిన పని లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింగరావు, గిర్దావర్ గంగారెడ్డి, నాగేంద్రబాబు, సంజీవ్ కుమార్, ఆయేషా ఫాతిమా, సత్యవతి తదితరులు ఉన్నారు.
