students | 91.37% ఉత్తీర్ణత నమోదు
students | 91.37% ఉత్తీర్ణత నమోదు
students |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీలో పాలిసెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈసారి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం నమోదై విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది.
మొత్తం 1,77,581 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,63,008 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,48,950 మంది అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది పాలిసెట్‌లో 91.37 శాతం ఉత్తీర్ణత నమోదవడం విశేషం. గతంతో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను polycetap.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే మన మిత్ర వాట్సాప్ నెంబర్ 95523 00009 నెంబర్ కు హాయ్ అని మెస్సేజ్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
