Merits certificates | జాతీయ స్థాయి పోటీలకు..

Merits certificates | నాగాయలంక, ఆంధ్రప్రభ : రాష్ట్ర స్థాయి మాస్టర్స్ ఎథ్లెట్స్ పోటీలు ఈనెల 12, 13 వ తేదీలలో నెల్లూరు జిల్లాలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగాయి. మండలంలోని భావదేవరపల్లికి చెందిన మెండు సత్యనారాయణ, పర్రచివరకు చెందిన భోగాది మల్లీశ్వరి పలు పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీల నిర్వహకులు నరేంద్ర రెడ్డి వీరికి మెరిట్స్ సర్టిఫికెట్లను అందచేశారు. వచ్చే ఏడాది జనవరి 28న హైదరాబాద్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరికి మండలి ఉదయ భాస్కర్, భోగాది రమాదేవి, మంచాల తిరుపతి, వరప్రసాద్ అభినందనలు తెలిపారు.

Leave a Reply