పదవ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు
పదవ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు
- రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్టు పరీక్షలు వాయిదా
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోని పదవ తరగతి ఇంటర్మీడియట్ సోమవారం జరిగే పబ్లిక్ పరీక్షలను నిర్వహించే తేదీలలో మార్పులు జరిగినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర డైరెక్టర్ రాష్ట్ర పరీక్షల అబ్జర్వర్ మర్రేడ్డి అనురాధ శుక్రవారం తెలిపారు. రంజాన్ పండుగ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అదే తేదీన నిర్వహించవలసిన పదో తరగతి 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష పేపర్ కోడ్‌లు 13ఈ 14 ఈ లను వాయిదా వేయబడినదని అనురాధ తెలిపారు.
అందువలన, 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష ను ఏప్రిల్ 2 వ తేది గురువారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించబడునని తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు తమ తమ జిల్లాలలో ఈ మార్పును విస్తృతంగా ప్రచారం చేయించి, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి సమాచారం చేరేలా నిర్ధారించాలని ఆదేశించారు.
ఏప్రిల్ రెండో తేదీన నిర్వహించే ఇంగ్లీష్ పరీక్షను సజావుగా నిర్వహించుటకు సంబంధిత జిల్లాలలో పరీక్షా కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం మరియు అవసరమైన ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉంచవలెనని అనురాధ ఆదేశించారు. ఈ నెల 21వ తేదీన విధులకు నియమించబడిన ఇన్విజిలేటర్లు యథావిధిగా ఏప్రిల్ రెండో తేదీ న కూడా విధులు నిర్వహించవలెనని ఆదేశించారు.దీనికి సంబంధించిన సవరణ ఉత్తర్వులు శాఖ నుండి విడిగా జారీ చేయబడుతా యని తెలిపారు.
ఈ ఉత్తర్వులు ఇది అత్యవసరంగా పరిగణించలను విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. ఏప్రిల్ రెండో తేదీన జరిగే ఇంగ్లీష్ పరీక్షకు ఏ విద్యార్థి గైరాజరి కాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారుల ది జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో కూడా మార్పులు చేసింది.
మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్, లాజిక్ పరీక్షను లెక్క ప్రకారం మార్చి 21న నిర్వహించాలి. రంజాన్ పండుగ సందర్భంగా ఈ పరీక్షలను ఈనెల 25వ తేదీకి మార్పు చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయాలని ఇంటర్మీడియట్ శాఖ అధికారులు ఆదేశించారు. మిగిలిన పరీక్షలన్నీ యధాతధంగా జరుగుతాయన్న రు. పరీక్షలు రాసే విద్యార్థులు ఈ మార్పులు గమనించి దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా వారికి సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
