అమరావతి ఛాంపియన్ షిప్ కు సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : అమరావతి ఛాంపియన్ షిప్ కు ఇబ్రహీంపట్నం సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థి ఎంపికయ్యాడు. విజయవాడ ఎంబీపీ స్టేడియంలో జూలై 5న జరిగిన జిల్లా సెలక్షన్స్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థి ఒ.కుసుమ మనోహర్ అండర్ – 17 బాలుర హై జంప్ విభాగంలో పాల్గొని ప్రథమ స్థానం సాధించి అమరావతి ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యాడు. ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయిని సిస్టర్ జయప్రద, పీఈటీ కుమార్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయం తమ పాఠశాలకు గర్వకారణమన్నారు.
