Srileela | పెళ్లి.. అసలు నిజం ఇదే..

Srileela | పెళ్లి.. అసలు నిజం ఇదే..

Srileela, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. తన అందం, అభినయంతో ఆకట్టుకుని.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి.. అందరి దృష్టిని ఆకర్షించింది. వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతుంది. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఆమధ్య వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి శ్రీలీల మ్యారేజ్ అనేది వార్తల్లో నిలిచింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఆమె ప్రస్తుతం తన కెరీర్‌ పైనే దృష్టి పెట్టింది. 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చింది. గతంలో వైరల్ అయిన ఫోటోలు పెళ్లికి సంబంధించినవి కావు. అవి ఆమె పుట్టినరోజు వేడుకకు సంబంధించినవి. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో నటించి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. అయితే.. పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేసింది. అయినప్పటికీ.. ఈ అందాల భామ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రావడంతో మరోసారి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు.

Leave a Reply