పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

ఘంటసాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామివారికి పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యముతో నిండు నూరేళ్లు ప్రజా పాలనలో, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ రాంబాబు, పిఎసిఎస్ చైర్పర్సన్ రాంబాబు, మార్కెట్ డైరెక్టర్ కొమరగిరి నాగిని, నీటి సంఘం అధ్యక్షులు బోయిన మనీ, జనసేన నాయకులు పవన్ కుమార్, కోలాల రుచిత్ కుమార్, అంబటి మహేష్, కొండవీటి వెంకట పవన్, సోమిశెట్టి రవికుమార్,శీలం వీర నాగేశ్వరరావు, కోలాల సన్నీ మరియు జన సైనికులు పాల్గొన్నారు
