దిల్‌సుఖ్‌నగర్ నుంచి డైరెక్టు బస్సు
జులై 9న వెళ్లి 12న రాక
కాణిపాకం, గోల్డెన్ టెంపు మీదుగా టూర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
గురుపౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివెళ్లడం ఆనవాయితీ. అయితే హైదరాబాద్ నుంచి కూడా అధిక సంఖ్యలో వెళుతుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ మేరకు హైదరాబాద్ రెండో డిపో మేనేజర్ ప్రత్యేక బస్సుల వివరాలు వెల్లడించారు.
దిల్‌సుఖ్‌నగర్ నుంచి..
దిల్‌సుఖ్‌నగర్ నుంచి నేరుగా అరుణాచలం నకు ప్రత్యేక బస్సు బయలుదేరుతుందని హైదరాబాద్ రెండో డిపో మేనేజర్ తెలిపారు. జూలై 9 న రాత్రి 7 గంటలకు దిల్‌సుఖ్ నగర్ నుంచి బస్సు బయల్దేరుతుందని, ఈ బస్సు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుందని, తిరిగి జూన్ 11న మధ్యాహ్నం అరుణాచలంలో బయలుదేరి 12వ తేదీన ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు.
ఒక్కరికి టికెట్ చార్జీ రూ.3900 గా నిర్ణయించామని తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా కానీ, దగ్గరలో ఉన్న ఏటీబీ ఏజెంట్ వద్ద కానీ రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్లు.. 9959444165, 9346559649, 9666350995, 7382838010, 9959226249 సంప్రదించవచ్చని తెలిపారు.