సౌందర్య లహరి

78. స్థిరోగంగావర్తఃస్తనముకుళరోమావళిలతా
కలావాలం కుండం కుసుమశరతేజోహుతభుజః
రతేర్లీలాగారంకిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధే ర్గిరిశనయనాంవిజయతే.

తాత్పర్యం: పర్వతరాజపుత్రీ, నీ బొడ్డు స్థిరంగా ఉన్న గంగానది సుడి గాను, స్తనములు అనే పూలమొగ్గలను వహించే నూగారు అనే తీగకి పాదు గాను,మన్మథుడి తేజస్సు అంటే అగ్నికి హోమగుండం గాను, రతీదేవికి శృంగార గృహంగాను, నీ భర్త సదాశివుడి కన్నుల తపస్సిద్ధికిగుహాద్వారంగాను అయి, వర్ణనాతీతమై సర్వోత్కృష్టంగా ప్రకాశిస్తోంది.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *