social media | కొడుకు ట్యాలెంట్‌ కు లోకేశ్‌ ఫిదా

social media | కొడుకు ట్యాలెంట్‌ కు లోకేశ్‌ ఫిదా

social media | డైనోసార్ల ప్రపంచంపై ఆసక్తికర విషయాలతో ‘డైనో డీట్స్’
దేవాన్ష్ రీసెర్చ్ చూసి ఆశ్చర్యపోయిన నారా లోకేశ్
ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు
నెటిజన్ల నుంచి దేవాన్ష్‌కు ప్రశంసల వెల్లువ

social media | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా మారారు. డైనోసార్ల ప్రపంచంపై ప్రత్యేక పరిశోధనలతో దేవాన్ష్ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించారు. ఈ సరికొత్త సాహసానికి సంబంధించిన ఆసక్తికర ప్రమోషనల్ టీజర్‌ను తండ్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ దేవాన్ష్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు.

డైనోసార్ల ప్రపంచంపై ఆసక్తికర విషయాలు..
ఈ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌కు ‘డైనో డీట్స్’ అని పేరు పెట్టారు. ఈ ఛానల్ ద్వారా దేవాన్ష్ కోట్లాది ఏళ్ల నాటి డైనోసార్లు, శిలాజాలు, ప్రాచీన అవశేషాలు, పురాతన చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో, వినోదాత్మకంగా వివరించనున్నారు. చిన్న వయసులోనే ఎంతో సృజనాత్మకంగా, విజ్ఞానాన్ని పంచేలా ఒక విద్యాసంబంధిత ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం విశేషం.

social media

రూమ్‌ని ‘డైనోసార్ వరల్డ్’గా మార్చేసిన దేవాన్ష్..
ఈ పాడ్‌కాస్ట్ కోసం దేవాన్ష్ చేసిన హోమ్‌వర్క్ , రీసెర్చ్ చూసి మంత్రి నారా లోకేష్ సైతం ఆశ్చర్యపోయారు. దేవాన్ష్ తన గదిని పూర్తిగా డైనోసార్ల పుస్తకాలు, విభిన్నమైన బొమ్మలు, పెయింటింగ్స్‌తో నింపేశారు. ఇంట్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక లోకేష్ కొడుకు రూమ్‌లోకి వెళ్లి వివరాలు అడగగా.. దేవాన్ష్ ఈ పాడ్‌కాస్ట్ , రీసెర్చ్ ప్లాన్ గురించి వివరించారు.

దీనిపై లోకేష్ సరదాగా స్పందిస్తూ.. “పిల్లలు మనల్ని ఎప్పుడూ ఊహించని విధంగా ఆశ్చర్యపరుస్తుంటారు. దేవాన్ష్ సృష్టించిన ఈ ప్రాచీన ప్రపంచంలోకి నేను కూడా ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

social media

ప్రతి శుక్రవారం సరికొత్త ఎపిసోడ్..
ఈ ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ వచ్చే శుక్రవారం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత ప్రతి వారం శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ చొప్పున డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.
దేవాన్ష్ ప్రారంభించిన ఈ సరికొత్త డిజిటల్ ప్రయాణానికి నారా-నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

CLICK HERE TO READ టాప్‌ విద్యార్థులతో మంత్రి టీజీ భరత్‌ లంచ్‌మీట్‌.

CLICK HERE TO READ MORE

Leave a Reply