Erravalli | కెసిఆర్ తో కవిత భేటీ

హైదరాబాద్ : లేఖ వివాదం తర్వాత మొదటి సారి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) ఆమె భర్తతో కలిసి కేసీఆర్‌ను (KCR) కలిశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు (Erravalli farm house)వెళ్లి బుధవారం ఉదయం తండ్రి కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు

ఇక హరీశ్ రావు (Harish Rao) కూడా నిన్నటి నుంచి ఫాంహౌస్‌లోనే ఉన్నారు. మరికాసేపట్లో కేసీఆర్ కాళేశ్వరం విచారణకు (Kaleswaram Commission) హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కవిత, కేసీఆర్ ల భేటీ చర్చనీయాంశంగా మారింది. ఉదయం ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు బయలుదేరనున్నారు.

కాగా తండ్రి కేసీఆర్‌ని చూసి ఆమె భావోద్వేకానికి గురయ్యారు.. కేసీఆర్‌తో కలిసి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు కవిత, హరీశ్‌ లు హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా ఫాంహౌస్‌కు చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *