ఏడవ రోజు ‘వేపకాయల బతుకమ్మ’

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఏడవ రోజుకు చేరుకుంది. సెప్టెంబరు 21న ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాలు, ఇప్పటికే ఆరు రోజులు పూర్తి చేసుకున్నాయి.

బతుకమ్మ పండుగలో ఏడవ రోజును ‘వేపకాయల బతుకమ్మ’ గా జరుపుకుంటారు. ఈ రోజున తంగేడు, గునుగు, చామంతి, గులాబి వంటి పూలతో ఏడు వరుసలలో బతుకమ్మను పేర్చుతారు.

నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయల ఆకారంలో చేసి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పప్పు, బెల్లం కలిపి కూడా నైవేద్యంగా పెడతారు. ఈరోజు కూడా మహిళలందరూ కలిసి బతుకమ్మ చుట్టూ చేరి, పాటలు పాడుతూ, ఆడిపాడి ఆనందంగా గడుపుతారు.
ఈ వేడుకలు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.

Leave a Reply