GAME | రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

GAME |రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
GAME |మక్తల్, ఆంధ్రప్రభ : ఈ నెల 21న నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ ఉన్నత పాఠశాల తుడుకుర్తిలో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్ 17 ఖో -ఖో విభాగంలో నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని కర్నిపాఠశాల విద్యార్థినులు వై.శశిరేఖ, ఎన్.శివానిలు నారాయణపేట జిల్లా ఖో ఖో జట్టు తరపున పాల్గొని, ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి.రూప తెలిపారు. ఎంపికైన విద్యార్థినులు శశిరేఖ, శివాని ఈనెల 24 నుంచి 26 వరకు జడ్పీ ఉన్నత పాఠశాల పంతంగి, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే 69 వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ ఖోఖో పోటీలలో పాల్గొంటారని బి.రూప తెలిపారు.
ఈ బాలికలు ఇద్దరూ గత రెండు సంవత్సరాల నుంచి జాతీయస్థాయి ఖోఖో క్రీడల్లో ప్రతిభ కనపరచారని ఆమె తెలిపారు. పాఠశాల హెచ్ఎం వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఖో ఖో క్రీడలకు ఎంపికైన బాలికలను, నిత్యం విద్యార్థులకు క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇస్తున్న పీడీ బి.రూపను అభినందించారు. ఎన్ ఐ ఎస్ ఖో ఖో కోచ్ ,ఫిజికల్ డైరెక్టర్ బి.రూప రాష్ట్ర స్థాయి ఖో ఖో టెక్నికల్ అఫీషియల్ గా యాదాద్రి భువనగిరికి ఆటలు ఆడించుటకు తరలి వెళ్లినట్లు పాఠశాల జిహెచ్ఎం వెంకటయ్య గౌడ్ తెలిపారు. రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలకు ఎంపికైన బాలికలను, కోచ్ పిడి, బి.రూపను రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేతి కృష్ణమూర్తి, అడ్వైజర్ బి.గోపాలం, జిల్లా ప్రధాన కార్యదర్శి విలియం అభినందించారు.
