అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు స్కూల్ డ్రెస్ పంపిణీ..
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఉన్న అంగ న్వాడి కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు స్కూల్ డ్రెస్ పంపిణీ కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 9వ వార్డ్ కౌన్సిలర్ సౌదరపెళ్లి సంపత్ రాజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల విద్యాభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో విద్యపై ఆసక్తి పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినం దనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
