ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో వి బి జి రామ్ జీ 125రోజుల ఉపాధి హామీ పథకం మల్లె చెరువు ప్రాంతంలో చేపడుతున్న పనులను సర్పంచ్ బేల్దారి నవీన్ టీఏ స్వరూప శుక్రవారం పరిశీలించారు.పని ప్రదేశంలో కూలీలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గ్రామ పంచాయతీ ఖర్చులతో కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బేల్దారి నవీన్ మాట్లాడుతూ ఎండల దృష్ట్యా కూలీలు త్రాగునీరుతో పాటు మజ్జిగ త్రాగాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం తొందరగా రావాలని వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్,గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply