విద్యాసాగర్‌రావును కలిసిన తంగెడ ఫౌండేషన్

విద్యాసాగర్‌రావును కలిసిన తంగెడ ఫౌండేషన్

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ:

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం, ధన్వంతరి మల్టీపర్పస్ హాల్ నిర్మాణ కార్యక్రమాల గురించి తంగెడ ఫౌండేషన్ ప్రతినిధులు మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తంగెడ ఫౌండేషన్ ప్రతినిధి తంగెడ ప్రేమానందరావు సూరారం గ్రామంలో కొనసాగుతున్న ఆలయ నిర్మాణ, సేవా కార్యక్రమాల పురోగతిని మాజీ గవర్నర్‌కు వివరించారు.నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం, ధన్వంతరి మల్టీపర్పస్ హాల్‌లను ప్రత్యక్షంగా సందర్శించాలని కోరగా, తప్పకుండా సందర్శిస్తానని చెన్నమనేని విద్యాసాగర్ రావు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కోదండ రామాలయ నిర్మాణ సేవా సమర్పణ బృందం, ఫౌండేషన్ సభ్యులు, ఆలయ భక్తులు మాజీ గవర్నర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల అభివృద్ధికి ఆయన ఆశీస్సులు అందించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply