Tadipatri | జేసీ ప్రభాకర్‌రెడ్డి, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం..

Tadipatri | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు జేసీ ప్రభాకర్‌రెడ్డి హాజరైన సమయంలో వైసీపీ నేతలతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

సంజీవరెడ్డి సోదరుడు శ్రీరామ్‌రెడ్డిని చూసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శ్రీరామ్‌రెడ్డిని ఫంక్షన్‌ హాల్‌ నుంచి వెళ్లిపోవాలని జేసీ చెప్పడంతో.. తామెందుకు బయటకు వెళ్లాలని వైసీపీ నేత కందిగోపుల మురళి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాహ వేడుక నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆయన అనుచరులు అక్కడికి చేరుకుని వైసీపీ నాయకులు, వారి వాహనాలపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫంక్షన్‌ హాల్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు పరిస్థితిని పరిశీలించి, వివాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.