Renuka Ellamma Bonalu | బోనం సమర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Renuka Ellamma Bonalu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో గౌడ ఐక్యసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 13వ కల్లు ఘటం–సాక బోనం కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రేణుక ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి, సంప్రదాయబద్ధంగా కల్లు సాక పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడల ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతికి అనుగుణంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ప్రారంభించామని తెలిపారు. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ వేడుకలు ఇప్పుడు 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. గౌడల సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బబ్బూరి భిక్షపతి గౌడ్‌తో పాటు గౌడ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.