June 9 | శ్రీలంక పర్యటనకు ఇండియా-ఎ జట్టు

June 9 | శ్రీలంక పర్యటనకు ఇండియా-ఎ జట్టు

June 9 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఇండియా-ఎ జట్టును Board of Control for Cricket in India (బీసీసీఐ) ప్రకటించింది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు సిరీస్‌లో భారత్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్-ఎ జట్లు తలపడనున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశమిస్తూ బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది.

ఈ సిరీస్‌కు తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించగా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్‌, హర్ష్ దూబె వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.

 June 9 |

వికెట్ కీపర్లుగా ప్రభసిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్ర ఎంపికయ్యారు. అలాగే విప్రాజ్ నిగమ్‌, యశ్ ఠాకూర్‌, యుద్‌వీర్ సింగ్‌, అన్షుల్ కంబోజ్‌, అర్షద్ ఖాన్‌ వంటి బౌలర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్ యువ ఆటగాళ్ల ప్రతిభను నిరూపించుకునే వేదికగా నిలవనుంది.

click here to read more : 8 teams| ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్ ర‌స‌వ‌త్త‌రం

click here to read more

Leave a Reply