RCB vs SRH | టాస్ గెలిచిన బెంగ‌ళూరు…

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు జ‌రుగుతున్న‌ 65వ మ్యాచ్ లో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) – సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌‌హెచ్‌) జట్ల మధ్య ఉత్కంఠ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరు హోం గ్రౌండ్ లో జరగాల్సి ఉండగా.. వాతావరణ సమస్యల కారణంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.

టాస్ అప్డేట్ !

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో స‌న్ రైజ‌ర్స్ ముందుగా బ్యాటింగ్ చేపట్ట‌నుంది.

తుది జ‌ట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎన్గిడి, యష్ దయాల్, సుయాష్ శర్మ.

టాప్ 2 టార్గెట్ !

ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టాప్-ఫార్మ్‌లో ఉన్న బెంగళూరు జట్టు.. ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఇకపై వారి దృష్టి టాప్-2లో స్థానం దక్కించుకోవడంపై ఉంది. దాంతో నేటి మ్యాచ్ లో గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగ‌నుంది బెంగ‌ళూరు జ‌ట్టు. టాప్-2లో నిలిస్తే క్వాలిఫైయర్-1లో పోటీపడే అవకాశం ఉంటుంది, అది ఫైనల్‌కు చేరుకునే చక్కటి అవకాశంగా మారుతుంది.

గౌరవం కోసం పోరాటం..

మ‌రోవైపు, హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయినప్పటికీ గత మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్.. తమ చివరి మ్యాచ్‌లను గెలచి సీజన్‌ను విజయంతో ముగించాలని ఆశిస్తోంది.

ఆర్సీబీ vs ఎస్‌ఆర్‌‌హెచ్ – హెడ్ టు హెడ్ రికార్డ్:

ఇప్పటి వరకూ ఆర్సీబీ – ఎస్‌ఆర్‌‌హెచ్‌ మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎస్‌ఆర్‌‌హెచ్‌ 13 సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ 11 సార్లు గెలిచింది.

రికార్డుల వేట !

  • విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున 9000 పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 67 పరుగులు దూరంలో ఉన్నాడు.
  • మయాంక్ అగర్వాల్‌కు 100 ఐపీఎల్ సిక్సర్లు పూర్తి చేయడానికి 2 సిక్సర్లు కావాలి.
  • ఫిల్ సాల్ట్‌కు 50 ఐపీఎల్ సిక్సర్లు పూర్తిచేయడానికి ఇంకా 3 సిక్సులు అవసరం.
  • అభిషేక్ శర్మ 4000 టీ20 పరుగులకు కేవలం 32 పరుగుల దూరంలో ఉన్నాడు.

Leave a Reply