Corona Strikes|తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు

హైదరాబాద్ | తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ చేయగా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఏపీలోనూ కరోనా వైరస్‌ విస్తరిస్తున్నది. అక్కడ రెండు కేసులు నమోదయ్యాయి. తొలుత వైజాగ్‌ మద్దెలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చలిజ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షల్లో కొవిడ్‌ 19గా తేలింది.. అలాగే నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే కేసును అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

Leave a Reply