ఉచిత ఇసుక పాలసీ ని పటిష్ఠంగా అమలుచేస్తున్నాం

ఉచిత ఇసుక పాలసీ ని పటిష్ఠంగా అమలుచేస్తున్నాం

-మంత్రి కొల్లు రవీంద్ర

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని పటిష్ఠంగా అమలుచేస్తున్నామని, గత రెండేళ్లుగా ప్రజలకు ఇసుక అందించడం లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి మైనింగ్ ఎక్సైజ్ శాఖల అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోందన్నారు. అపారమైన ఖనిజ సంపద ఆంధ్ర రాష్ట్రంలో ఉందని, ఈ వనరుల ద్వారా అటు ప్రభుత్వానికి ఆదాయం , ప్రజలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ మేరకు ప్రభుత్వం వచ్చిన వెంటనే సాండ్ పాలసీ మైనింగ్ పాలసీ, ఎక్సైజ్ పాలసీ లను అమలు చేయడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ అమలు అస్తవ్యస్తంగా జరగడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. NGT లో కేసులు పడ్డాయని,అధికారులు కోర్టులకు వెళ్లవలసి వచ్చిందని తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ సాండ్ పాలసీ అమలు చేసిందని, ఈ రెండు సంవత్సరాలు కూడా ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించి లబ్ధిదారునికి తక్కువ ధరకే ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రూ. 202 రూపాయలకే ఇసుక అందిస్తున్నామని, రవాణా దూరాన్ని బట్టి చార్జెస్ చేయడం జరుగుతుందని తెలిపారు.. వర్షాకాలానికి ముందే సరిపడా ఇసుక నిలువలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు 250 కోట్ల పైనే ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం ప్రజలకు ఇసుక అందజేసిందన్నారు.

ఇసుక సరఫరాలో ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, ఏదైనా తప్పులు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతోందని మంత్రి తెలిపారు. అలాగే మైనింగ్ రంగ అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం 30% గ్రోత్ మైనింగ్ రంగంలో తీసుకొని వచ్చా మన్నారు. జిల్లాలో జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ఆపరేషన్ లోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఇదే కాకుండా మరో రెండు, మూడు ఐడెంటిఫై చేశామన్నారు. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం తెచ్చే విధంగా ఉంటుందన్నారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఒక పాలసీ తీసుకువచ్చామన్నారు. నవోదయ 2.0 ద్వారా నాటు సారా నిర్మూలన పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఎల్సిడి లిక్కర్ లేకుండా చేశామని తెలిపారు. నేడు అతి తక్కువ ధరకే రూ.99 కే లిక్కర్ తీసుకొని రావడం జరిగిందని తెలిపారు.

కల్తీ మద్యం లేకుండా దాదాపుగా ఐదు ప్రాంతాల్లో ల్యాబ్స్ పెట్టి 13 రకాల పరీక్షలు చేసి, ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సురక్ష యాప్ తీసుకొని వచ్చామని, ఇప్పటివరకు ఒక్క బాటిల్ కూడా ఎక్కడ ట్రేస్ కాలేదని, డిస్టిలరీ ల నుంచి, డిపోల దగ్గర నుంచి, షాప్ దగ్గర నుంచి షాంపుల్స్ ఎప్పటికప్పుడు తెప్పించి టెస్టులు చేసి ఎక్కడ కూడా కల్తీ జరగకుండా చేయడం జరిగిందని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ అని కూడా బలోపేతం చేశామని, వీటి ద్వారా క్రైమ్ కంట్రోల్ చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. కొంతమందిపై పీడి యాక్ట్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లాలో డ్రోన్ సిటీ, రిలయన్స్ ల వంటి పరిశ్రమలతో పాటు ఓర్వకల్లు ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. అలాగే మొన్ననే డిఫెన్స్ రంగానికి సంబంధించి పుట్టపర్తిలో ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి చేతుల మీద శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ మన రాష్ట్రం వైపు వస్తున్నాయి, ఎందుకంటే ప్రభుత్వం కల్పిస్తున్న స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పాలసీల వల్లే అని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కర్నూల్ లో ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటుకు.. కృషి చేస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఎక్సైజ్ సొంత భవనాలు ఏర్పాటు చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న భవనాలను. మరమ్మతులు చేస్తామన్నారు.

Leave a Reply