Ration Card Guidelines | రేషన్ కార్డుదారులకు కీలక సూచనలు

Ration Card Guidelines | రేషన్ కార్డుదారులకు కీలక సూచనలు
Ration Card Guidelines | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో రేషన్ సరఫరా నిలిపివేయడం, రేషన్ కార్డు రద్దు కావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా పెన్షన్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని సమాచారం.
e-KYC పూర్తి చేయడానికి కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో సమీప రేషన్ దుకాణం లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా సులభంగా e-KYC నమోదు చేసుకోవచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితమని అధికారులు వెల్లడించారు. వేలిముద్ర పని చేయని వారికి ఐరిస్ స్కాన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు.
కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ e-KYC తప్పనిసరిగా చేయించుకోవాలని, ఆలస్యం చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరియు స్టేటస్ చెక్ చేసుకోవడానికి GSWS Helper Portal వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
