8may2026 | ఢిల్లీలో డూ ఆర్ డై

8may2026 | ఢిల్లీలో డూ ఆర్ డై

8may2026 | ఐపీఎల్‌లో కోల్‌క‌తాతో ఢిల్లీ ఢీ
అరుణ్‌జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌
రాత్రి 7.30 గంటలకు ప్రారంభం
రెండు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం
ఓడితే ఇంటిబాట ప‌ట్ట‌క త‌ప్ప‌దు
కోల్‌కతా 9 మ్యాచ్‌ల‌కు 3 గెలుపు
ఢిల్లీ 10 మ్యాచ్‌ల‌కు 4 విజ‌యం

8may2026 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మ‌రో ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌నుంది. ఈ రోజు 51వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ కాపిటల్స్ ఢీకొన‌బోతున్నాయి. ఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే రెండు జట్లు ఈ సీజన్ లో అంతాగా రాణించ‌డం లేదు. ఓటములతో ఇబ్బందులు పడుతున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ అనేక ఓటముల తర్వాత విజయాలు అందుకోగా, ఆరంభంలో విజయాలు అందుకున్న ఢిల్లీ కాపిటల్స్ తర్వాత వ‌రుస ఓటములతో క‌ష్టాల్లో ఉంది. ఈ రెండు జ‌ట్లు టేబుల్‌లో అడుగులో ఉండిపోయాయి.

కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడి మూడింటిలోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ కాపిటల్స్ పది మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లలోనే గెలిచి ఆరు మ్యాచ్ లలో ఓడింది. ఎనిమిది పాయింట్లతో ఒక రకంగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య పోరు నేడు ఆసక్తికరంగా సాగనుంది. గెలుపు ఎవరిదైనా ప్లే ఆఫ్ కు చేరడం కష్టమే.

ఐపీఎల్‌లో ఈ రెండు మ‌ధ్య 34 మ్యాచ్‌లు జ‌రిగాయి. ఇందులో కోల్‌క‌తా 19 మ్యాచులు గెల‌వ‌గా.. ఢిల్లీ 15 మ్యాచులు గెలిచింది. ఢిల్లీ జట్టులో కెఎల్ రాహుల్ , అక్షర్ పటేల్ (C), కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్ కీల‌క ఆట‌గాళ్లు. కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్ కీలక పాత్ర పోషించనున్నారు.