ఘనంగా రంజాన్ వేడుకలు..

ఘనంగా రంజాన్ వేడుకలు..
- ఈద్గాలో ప్రార్థనలు చేసిన మంత్రి కొండ సురేఖ
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రజలందరూ మతసామరస్యంతో మెలగాలని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు అన్నారు.రంజాన్ పర్వదినం పురస్కరించుకొని మంత్రి కొండా సురేఖ 39 వ డివిజన్ ఫోర్ట్ రోడ్ లోని ఈద్గా లో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ప్రార్థనలు నిర్వహించారు.

ముస్లింల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. నగరంలోని అన్ని దర్గాలను అభివృద్ధి చేస్తున్నామని దర్గాల అభివృద్ధికి ఎల్బీనగర్, ఫోర్ట్ రోడ్ ఈద్గాల అభివృద్ధికి ఒక్కొక్క ఈద్గాకు కోటి రూపాయల చొప్పున నగరంలోని అన్ని దర్గాలకు 6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమం లో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు.
