మేడ్చల్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు..

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 297,298 డివిజన్ల పరిధిలో భారత మాజీ ప్రధానమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.మేడ్చల్ సర్కిల్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 297, 298 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ సాంకేతిక ప్రగతికి, యువతకు ఓటు హక్కు కల్పనకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిర్ల రమేష్, కౌన్సిలర్ కౌడే మహేష్, శాప రాజు ,మహేష్ శ్రవణ్ గుప్త , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యు.సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, చెరువుకొమ్ము శేఖర్ గౌడ్, సంతోష్ గౌడ్, రఘుపతి రెడ్డి, వెంకటేష్, రాజశేఖర్ రెడ్డి, ఎర్ర విజయ్ రావు, నరసింగరావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply