Qualifier1Match | ఆ జ‌ట్టుకు భారీ షాక్!

Qualifier1Match | ఆ జ‌ట్టుకు భారీ షాక్!

Qualifier1Match | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధమైంది. నేటి(మంగళవారం) నుంచి ప్రారంభమయ్యే ప్లేఆఫ్ మ్యాచ్‌లతో టైటిల్ పోరు మరింత ఉత్కంఠగా మారనుంది. తొలి క్వాలిఫయర్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ (Royal Challengers Bengaluru), గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌పై ఇప్పుడు వర్ష భయం నెలకొంది.

ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లకు బీసీసీఐ ఎలాంటి రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఫలితం నేరుగా పాయింట్ల పట్టిక ఆధారంగా నిర్ణయించబడుతుంది.

లీగ్ దశలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ రెండూ చెరో 9 విజయాలతో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ టేబుల్ టాపర్‌గా నిలవగా.. గుజరాత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ పూర్తిగా రద్దయితే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అంటే నేటి క్వాలిఫయర్-1 మ్యాచ్ వర్షం వల్ల జరగకపోతే ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్‌కు ఇది భారీ నిరాశగా మారనుంది.

ఇప్పటికే ధర్మశాలలో వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

CLICK HERE TO READ 26mayipl | ఐపీఎల్‌లో నేడు క్వాలిఫయర్‌-1

CLICK HERE TO READ MORE

Leave a Reply