షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
వీఆర్ పురం, ఏఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రభ : అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్ పురం మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన కోట్ల రమణయ్య తన కూతురు ముత్యాల జయమ్మకు చెందిన ఇల్లు బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. గ్రామస్తులు మేల్కొని మంటలను ఆర్పటంతో గ్రామానికి పెను ప్రమాదం తప్పింది. రెవెన్యూ శాఖ అధికారులు జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలోనే ఆస్తి నష్టం జరిగింది. ఇంటిలో ఉన్న వివిధ సామగ్రి, నగదు, బంగారం కాలిపోయాయని బాధితుల వాపోయారు. వివిధ రకాల డాక్యుమెంట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. కట్టు బట్టలతో బాధితులు దిక్కులేని స్థితిలో రోడ్డున పడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు బాధ్యత కుటుంబాల వారు కోరుతున్నారు.

