ప్రచారంలో దూసుకుపోతున్న ప్రవళిక….
ప్రచారంలో దూసుకుపోతున్న ప్రవళిక….
బూర్గంపాడు, (ఆంధ్రప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ మండలం నాలుగో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసర బోయిన ప్రవళిక ప్రసారంలో దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గెలుపు కోసం వనమా రాఘవ కాన్వాయ్ తో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాల్వంచ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు చేసిన అభివృద్ధి కనబడుతుందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబెట్టారు. డివిజన్ లు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాలుగో డివిజన్ అభ్యర్థి ప్రవళిక గెలుపు నల్లేరు మీద నడకేనని అన్నారు. ఓటర్లు ఆశీర్వదించి ప్రవళికను గెలిపించి డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
