సూర్య ప్రధాన పాత్రలో, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రెట్రో. ఈ యాక్షన్ లవ్ స్టోరీ మే 1న విడుదల కానుంది. ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే, నటి పూజ ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లను తనదైన శైలిలో ప్రారంభించింది. చీరలో మెస్మరైజ్ చేస్తూ, రెట్రో మూవీ లుక్స్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజ.








