ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందడి
ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందడి
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: పెద్దపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో పోలింగ్ నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల అధికారిగా న్యాయవాది బాదం రమేష్ వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా ప్రముఖ వ్యాపారి కొమురవెల్లి రాజేందర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష పదవి కోసం ఓజ్జల సదానందం, మంచాల వరప్రసాద్, బోడ్ల రమేష్ పోటీలో ఉన్నారు. సభ్యులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటుండగా, పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
