Breaking| ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు: ఐఏఎఫ్ ట్వీట్
ఢిల్లీ : ఆపరేషన్ సిందూర్ ఆగలేదని, ఇంకా కొనసాగుతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘ఆపరేషన్ సిందూర్’పై ఊహాగానాలను నమ్మవద్దని కోరింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తమకు ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేశామని ఐఏఎఫ్ పేర్కొంది. భారత్-పాక్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.
